![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో... ప్రకాష్ పై సుభాష్ కోప్పడ్డాడని ధాన్యలక్ష్మి తన బావగారని కూడా చూడకుండా అరిచేసరికి.. నాదే తప్పంటు సుభాష్ సారి చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సుభాష్ బయటకు వచ్చి బాధపడుతుంటే తన దగ్గరికి ప్రకాష్ వస్తాడు. నా భార్య అన్న దానికి నేను సారీ చెప్తున్న అని ప్రకాష్ అంటాడు. అయిన నాదే తప్పులే నీపై ఇలా అరిస్తే నీ మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోలేకపోయానని సుభాష్ ఎమోషనల్ అవుతాడు.
ఆ తర్వాత నాలో లోపం ఉన్నా సరే నన్ను భరిస్తున్నావ్ అన్నయ్య అని ఇద్దరు ఒకరికొకరు ఎమోషనల్ అవుతూ హగ్ చేసుకొని ఏడుస్తారు. ఆ సీన్ మోస్ట్ ఎమోషనల్ గా సాగుతుంది. మరొకవైపు రాజ్ కి వినపడేలా క్యారమ్ ఆడుతున్నామని అప్పు అనగానే వెంటనే రాజ్ బయటకు వస్తాడు. కావ్య, భాస్కర్ ఇద్దరు క్యారమ్ ఆడుతుంటే చూడలేక.. మేమ్ కూడ ఆడుతామంటు రాజ్ అంటాడు. ఇక రాజ్ , భాస్కర్ ఒక జట్టు.. కావ్య అప్పులు ఒక జట్టుగా ఉంటారు. ఎవరు ఏ జట్టు అయిన సరే కావాలనే కావ్య, భాస్కర్ లు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటు ఉంటారు. అది చూడలేక రాజ్ ఫ్రస్ట్రేషన్ తో అరుస్తుంటాడు. ఆ తర్వాత రాజ్ గదిలోకి వచ్చి కావ్య వేసిన డిజైన్స్ పై కలర్ పడేస్తాడు. ఇక తెలియనట్టు బయటకు వచ్చి కావ్యని డిజైన్స్ తీసుకొని రమ్మని చెప్తాడు. కావ్య వెళ్లి చూసేసరికి డిజైన్స్ పై కలర్ ఉండడం చూసి.. ఇప్పుడేం చెయ్యాలని టెన్షన్ పడుతుంది. అప్పుడే రాజ్ వచ్చి డిజైన్స్ చూసి కోప్పడతాడు.
ఆ తర్వాత ఇక మళ్ళీ కూర్చొని వెయ్యి అంటాడు. అప్పుడే భాస్కర్ వచ్చి.. అవసరం లేదు నా ఫోన్ లో ఫోటో తీసుకున్నానని అనగానే రాజ్ కి తిక్కకుదరుతుంది. మరొకవైపు ఇందిరాదేవి దగ్గరికి అపర్ణ వచ్చి.. ఇంట్లో ధాన్యలక్ష్మి చేసిన గొడవ గురించి చెప్తుంది. రోజురోజుకి ఇలా తయారవుతుంది మీరే చూసుకోండని ఇందిరాదేవికి ధాన్యలక్ష్మి చెప్తుంది. తరువాయి భాగంలో భాస్కర్, కావ్య, అప్పు ముగ్గురు చలిమంట దగ్గర డాన్స్ చేస్తుంటారు. అప్పుడు నిప్పుపై కావ్య అడుగెయ్యబోతుంటే రాజ్ తన చెయ్యి అడ్డుపెడతాడు. అయ్యో ఏమైంది అంటూ కావ్య రాజ్ చెయ్యి వైపు చూస్తూ కంగారుపడుతుంటే.. నాకేం కాలేదు మీ బావకి అయినట్టు ఉందని రాజ్ అంటాడు. అయిన వినకుండా కావ్య రాజ్ చెయ్యిని పట్టుకొని ఉంటుంది. అప్పుడు రాజ్ పై కావ్యకి ఎంత ప్రేముందో భాస్కర్ గమనిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |